ఆ షాక్ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాను.. మళ్లీ మొదలు పెట్టారు!
on Dec 26, 2023
సాధారణ వార్తల కంటే సినిమాలకు సంబంధించిన వార్తలు లేదా సినిమా తారల వ్యక్తిగత విషయాల గురించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత రూమర్లు కూడా అదే స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈమధ్యకాలంలో తారల ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకులు, వారి కుటుంబాల్లోని గొడవలు.. ఇలా ఒకటేమిటి వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని వైరల్ చేసేందుకు నెటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నటి మీనాకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘మొదట్లో నాకు, మా వారు విద్యాసాగర్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, మేం విడిపోబోతున్నామని రూమర్లు పుట్టించారు. ఆ టైమ్‌లో మా బంధువులు ఫోన్ చేసి నన్ను ఈ విషయం గురించి అడిగేవారు. నిజానికి మా మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేనపుడు విదేశాలకు తీసుకెళ్దామని కూడా అనుకున్నాం. కానీ, ఈలోగా జరగరానిది జరిగిపోయింది. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నాను. ఆయన చనిపోయి కొన్ని నెలలు కూడా కాలేదు... అప్పుడే మళ్ళీ నా గురించి పుకార్లు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. హీరో ధనుష్, ఓ రాజకీయ నాయకుడు, సీనియర్ స్టార్, బిజినెస్‌మేన్.. ఇలా వారికి తోచిన వారితో నా పెళ్లి అని రాసుకుంటూ వెళ్తున్నారు. తాము రాసే వార్త నిజమో కాదో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం సరికాదు. ఇలాంటి రూమర్స్ వల్ల నా ఫ్యామిలీ బాగా ఎఫెక్ట్ అవుతోంది. ఇకనైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నటి మీనా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
