సుశాంత్ సింగ్ అకౌంట్ నుంచి రూ. 50 కోట్లు విత్‌డ్రా అయినా...
on Aug 4, 2020
బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు, బిహార్ పోలీసుల మధ్య జరుగుతున్న యుద్ధం సోమవారం మరింతగా ముదిరింది. సుశాంత్ ఆత్మహత్య దర్యాప్తులో భాగంగా డబ్బు వ్యవహారంపై ముంబై పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం లేదని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించడం దీనికి కారణం.
"గడచిన కొద్ది సంవత్సరాల్లో బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ్యాంక్ అకౌంట్‌లో దాదాపు రూ. 50 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఆశ్చర్యకరంగా ఆ డబ్బు మొత్తం విత్‌డ్రా అయింది. ఒక ఏడాది అతని అకౌంట్‌లో రూ. 17 కోట్లు జమయితే, అందులో రూ. 15 కోట్లు విత్‌డ్రా అయ్యాయి. దర్యాప్తుకు ఇది కీలకాంశం కాదా? మేం చప్పుడు చేయకుండా కూర్చోలేం. ఆ విషయంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వాళ్లను (ముంబై పోలీసులను) ప్రశ్నిస్తాం" అని మీడియాతో చెప్పారు డీజీపీ.
ఎస్పీ ర్యాంకులో ఉన్న తన కింది అధికారి వినయ్ తివారీని ఆదివారం ముంబై మునిసిపల్ అధికారులు క్వారంటైన్ చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. "సుశాంత్ పోస్ట్‌మార్టమ్, ఫోరెన్సిక్ రిపోర్టులను, ఆధారాలను పంచుకోవడానికి లేదా ఇవ్వడానికి బదులుగా మా ఎస్పీని వారు దాదాపు గృహ నిర్బంధం చేశారు. ఏ ఇతర రాష్ట్ర పోలీసుల నుంచి ఇలాంటి నాన్-కోపరేషన్‌ను నేను చూడలేదు. తమ దర్యాప్తు విషయంలో ముంబై పోలీసులు సిన్సియర్‌గా ఉన్నట్లయితే, మాతో దర్యాప్తు అంశాలను పంచుకోవాలి" అని స్పష్టం చేశారు బీహార్ పోలీస్ చీఫ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
