మెగాస్టార్ లక్కీ డేట్.. చరణ్ కీ ప్లస్సయ్యేనా!
on Oct 21, 2021
`మగధీర`(2009) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత డైరెక్టర్ నెం.1 ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా `ఆర్ ఆర్ ఆర్`. పిరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చరణ్. అంతేకాదు.. అల్లూరి సీతారామరాజుగా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు ఈ కొణిదెల వారి స్టార్. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే జనవరి 7న చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజయ్యింది. ఆ చిత్రమే.. `అన్నయ్య`(2000). ఆ యేటి ముగ్గుల పండక్కి మురిపించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది సదరు ఫ్యామిలీ ఎంటర్టైనర్. మరి.. మెగాస్టార్ లక్కీ డేట్స్ లో ఒకటైన జనవరి 7న విడుదల కానున్న `ఆర్ ఆర్ ఆర్`.. ఆయన తనయుడు చరణ్ కి కూడా ప్లస్ అవుతుందేమో చూడాలి.
కాగా, `ఆర్ ఆర్ ఆర్`ని డీవీవీ దానయ్య నిర్మించగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. ఇందులో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కనిపించనుంది.