ఆర్ఆర్ఆర్.. డిజిటల్, శాటిలైట్ రైట్స్‌పై కీలక ప్రకటన
on May 26, 2021
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ స్పష్టం చేశాయి.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జీ 5 సంస్థ స్ట్రీమింగ్ చేయనుండగా.. హిందీలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేస్తుందట. అలాగే వరల్డ్ వైడ్‌గా ఇంగ్లీష్, పోర్చు గీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలలోకీ నెట్ ఫ్లిక్స్ డబ్ చేసి విడుదల చేయనుంది. ఇక శాటిలైట్ విషయానికి వస్తే హిందీ వర్షన్ ను జీ సినిమాకు.. తెలుగు, తమిళ, కన్నడ వర్షన్స్ ను స్టార్ ఛానెల్స్ కు అప్పగించారు. అలాగే మలయాళం వర్షన్ శాటిలైట్ హక్కుల్ని ఏషియన్ నెట్ దక్కించుకుంది. ఇక హిందీలో థియేట్రికల్ రైట్స్ ను పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ కు అందించినట్టు పేర్కొన్న పెన్ స్టూడియోస్ సంస్థ.. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళికి, నిర్మాత డీవీవీ దానయ్యకు ధన్యవాదాలు తెలిపింది. అయితే దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతల నుండి స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోరాట యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఓలివియా మోరిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
