Home

»

Latest News

`ఆర్ ఆర్ ఆర్` ర‌న్ టైమ్.. కాస్త ఎక్కువే!

Nov 26, 2021 4:43PM

చ‌రిత్ర పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ పాత్ర‌ల‌కి క‌ల్పిత ఘ‌ట్టాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన పిరియ‌డ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`.  అల్లూరిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కొమురంగా యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప‌లు భాష‌ల్లో సంద‌డి చేయ‌నుంది. పాట‌లు, ప్ర‌చార చిత్రాలతో అంచ‌నాలు పెంచేస్తున్న ఈ విజువ‌ల్ వండ‌ర్.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. `ఆర్ ఆర్ ఆర్` ర‌న్ టైమ్ కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. 186 నిమిషాల‌ (3 గంట‌ల 6 నిమిషాలు) నిడివితో ఈ సినిమా జ‌నం ముందుకు రానుంద‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే.. ఈ డ్యూరేష‌న్ కాస్త ఎక్క‌వనే చెప్పాలి. మ‌రి.. జ‌క్క‌న్న సినిమాలంటే ఎమోష‌న్స్, విజువ‌ల్స్  మేలి క‌ల‌యిక కాబ‌ట్టి.. మ‌రోసారి ఆ మ్యాజిక్ కొన‌సాగి ఈ లెంగ్తీ సినిమా బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

కాగా, `ఆర్ ఆర్ ఆర్`లో అజ‌య్ దేవ‌గ‌న్, అలియా భ‌ట్, ఓలివియా మోరీస్, శ్రియ‌, స‌ముద్ర‌క‌ని ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి బాణీలు అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com