షెడ్యూల్ పూర్తి చేసుకున్న రోబో 2.0..!
on Apr 23, 2016
శంకర్ రజనీ ల క్రేజీ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది రోబో సినిమా. తమిళంలో ఎందిరన్ గా, హిందీలో రోబోట్ గా వచ్చిన రోబో అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని దక్కించుకుంది. దాంతో ఇప్పుడు రోబోకు సీక్వెల్ గా రోబో 2.0 తీస్తున్నారు శంకర్ రజనీ. ఈ సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఇప్పటికే షూటింగ్ మొదలైన రోబో 2.0 లో న్యూఢిల్లీలోని స్టేడియంలో అక్షయ్ రజనీల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. ఢిల్లీలో చిత్రీకరించిన సన్నివేశాలన్నింటిలోనూ భారీ గ్రాఫిక్స్ వాడనున్నారట. తాజాగా ఢిల్లీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని చెన్నై షెడ్యూల్ లోకి అడుగు పెట్టబోతోంది రోబో టీం. ప్రస్తుతానికి మొత్తం యూనిట్ కు సమ్మర్ బ్రేక్ ఇచ్చాడు శంకర్. తిరిగి 27 నుంచి చెన్నై శివార్లలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ భారీ ఖర్చుతో ఈ సెట్ వేశారని సమాచారం. సినిమాలో కీలక సన్నివేశాలన్నీ ఈ సెట్లోనే చోటు చేసుకుంటాయట. దాదాపు 350 కోట్ల రూపాయలతో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
