తిరుమల కొండపై నితిన్..రాబిన్ హుడ్ హిట్ అయ్యిందా!
on Mar 28, 2025
నితిన్(Nithiin)శ్రీలీల(sreeleela)కాంబోలో తెరకెక్కిన 'రాబిన్ హుడ్'(Robin Hood)మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.'భీష్మ'మూవీతో నితిన్ ని వరుస ప్లాప్ ల నుంచి బయటపడేసిన'వెంకీ కుడుముల'(Venki Kudumula)దర్శకత్వంలో రాబిన్ హుడ్ తెరకెక్కగా,మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు నితిన్ ని వెంకీ మళ్ళీ హిట్ ట్రాక్ మీదకి తీసుకొచ్చాడనే మాట చెప్తున్నారు.
నితిన్ ఈ రోజు తిరుమల తిరుపతి(Tirupathi)లో కొలువు తీరిన శ్రీ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోవడం జరిగింది.స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతు ఈ రోజు నేను నటించిన రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా తిరుమల వచ్చి స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.రాబిన్ హుడ్ ని ఇటివల పుష్ప 2(Pushpa 2)తో భారీ హిట్ ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది.
రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్,షైన్ టామ్ చాకో,లాల్,శుభలేఖ సుధాకర్,సిజ్జు,ఆడుకాలం నరేన్, దేవ్ దత్త నాగే వంటి వారు ప్రధాన పాత్రలు పోషించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.డేవిడ్ అనే డ్రగ్ డీలర్ క్యారక్టర్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్,ప్రముఖ హీరోయిన్ కేతికాశర్మ ప్రత్యేక గీతంలో చేసారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
