ఓజి మూవీలో అకీరా... రేణు దేశాయ్ రియాక్షన్!
on Apr 9, 2025
రేణు దేశాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువా..సూటిగా ఉంటుంది, సున్నితంగా హెచ్చరిస్తుంది, ఉన్నదే మొహం మీద చెప్పేస్తుంది. అలాంటి రేణు దేశాయ్ జాతకంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది అన్న అంశం ఉందని ఆమె ఒక పాడ్ కాస్ట్ లో చెప్పింది. ఇంతకు ఆమె ఎం చెప్పింది అంటే ."నా పిల్లలు కానీ నేను తెలిసిన వాళ్ళు కానీ నన్ను చూసి చెప్పేది ఒక్కటే..అబద్దం చెప్పడం రాదు అని, బాధను దాచడం రాదు అని.. నేను ఒక వేళా ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను అందరికీ చెప్పే జాయిన్ అవుతాను. నా జాతకంలో నేను పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాను అన్న విషయం ఉంది. కానీ ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వను నా పిల్లల కోసం నేను టైం స్పెండ్ చేస్తాను. మొన్నటి ఎన్నికల్లో లోకల్ పార్టీస్ కి ప్రచారం చేసాను అంటే ఇక్కడ ప్రజల కోసం ఏదైనా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో. కానీ నేను ఎప్పటికీ ఒక బీజేపీ పర్సన్ ని మాత్రమే. నన్ను ఎవరు ఏమి అనుకున్న అంధ భక్తురాలిని అని మోడీ భక్తురాలిని అని అనుకున్నా నేను పట్టించుకోను. కొంతమంది ఈ పార్టీ అంటారు ఆ పార్టీ అంటారు...అదేదో పెద్ద సీక్రెట్ లా దాస్తూ ఉంటారు. కానీ నేను పొలిటికల్ పార్టీలో చేరానంటే మాత్రమే అందరికీ తెలిసేలా జాయిన్ అవుతాను ఎందుకంటే నాకు అంతలా సీక్రెట్ ని మెయింటైన్ చేయడం రాదు. అదే నా మైనస్ పాయింట్ కూడా .అందుకే బహుశా నేను పాలిటిక్స్ కి ఫిట్ కానేమో అనిపిస్తూ ఉంటుంది. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏ బిడ్డ కూడా ఆకలితో బాధపడకూడదు. ఎందుకంటే మన దగ్గర ధాన్యం ప్రతీ ఒక్కరికీ తగినంత ఉంది ..అలాంటప్పుడు ఎందుకు మనం హెల్ప్ చేయకూడదు" అంటూ రేణు దేశాయ్ తన మనసులో మాటల్ని చాలా అద్భుతంగా చెప్పింది.
అలాగే తన కుమారుడు అకీరా గురించి కూడా చెప్పింది. ఓజి మూవీలో అతను పని చేయలేదని ఒక వేళా అకీరాకు నటించడం ఇష్టం ఉంటె తానె తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా చెప్తాను అని చెప్పింది. కొంతమంది యూట్యూబర్స్ డబ్బుల కోసం సెంటిమెంట్స్ తో థంబ్ నెయిల్స్ పెడుతున్నారని వాటిని నమ్మొద్దని చెప్పింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
