రేఖకు జీవన సాఫల్య పురస్కారం
on Dec 22, 2015

బాలీవుడ్ నటీమణి రేఖ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను టి.సుబ్బరామిరెడ్డి జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. బాలీవుడ్ దిగ్గజం యశ్‌చోప్ర స్మారకార్థం టిఎస్సార్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. 2016, జనవరి 25న ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డు ద్వారా బంగారు పతకం, 10 లక్షల రూపాయల నగదుతో రేఖను సత్కరించనున్నామని టీఎస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



