Home

»

Latest News

Regina Cassandra: రెజీనా సంచలన పోస్ట్.. లవ్ లో ఫెయిల్ అయ్యిందా!

Apr 18, 2026

 

-పరిచయం అక్కర్లేని పేరు రెజీనా కసాండ్రా 
-తెలుగుతో పాటు అన్ని భాషల్లో తన హవా 
-రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ 
-లవ్ ఫెయిల్యర్ అని చెప్తుందా!


సినీప్రియులు తమ సినీ ఆలోచనలని లాంగ్ చర్చల్లోకి తీసుకెళ్లిన మరు క్షణం వాళ్లందరికీ గుర్తొచ్చే పేరు రెజీనా కసాండ్రా(Regina Cassandra). తమిళ భామ అయినా కూడా ఆ మాట నమ్మనంతగా తెలుగు  ప్రేక్షకులకి దగ్గరయింది. ఒకానొక దశలో టాప్ హీరోయిన్ చైర్ లో కుర్చుంటుందని అనుకున్నారు. ప్రెజెంట్ మూడు పదుల వయసులో కూడా పలు బాషల చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తు బిజీగా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్  ఫ్యాన్స్, నెటిజన్స్ కి తన గురించి మాత్రమే ఆలోచించే పనిని కల్పించింది. ఆ వివరాలు చూద్దాం.
  
రెజీనా ఇన్ స్టాగ్రామ్ లో ఒక రోజు నేను ప్రేమకి సరెండర్ అయ్యాను. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది జరగకపోవడం అనేది ఆగదు. కాకపోతే ప్రేమ అనేది ప్రశాంతంతో కూడిన బలం. ప్రతి రోజు మీ కోసం మీరు నవ్వుతు ఉండాలి. ప్రేమ అందించడానికి అర్హులు అనే విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. ప్రేమించడం, ప్రేమించబడటంలో ఉన్న సంతోషం ప్రేమని కోల్పోయాకే అర్థమవుతుంది. ఆ కోల్పోవడం అనేది ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక బంధం కావచ్చు. జీవితం నేర్పే పాఠాలు మనిషిని మరింత దృఢంగా మారుస్తాయని పోస్ట్ లో పేర్కొంది. పోస్ట్ చూస్తుంటే రెజీనా లవ్ లో ఏమైనా ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. 

Also read: Prakash Raj: ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసిన ప్రకాష్ రాజ్.. అగ్ర రచయిత వ్యాఖ్యలు వైరల్ 

నెటిజన్స్, ఫ్యాన్స్ కూడా స్పందిస్తు పర్సన్ కంటే ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఎప్పుడు మీ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. మీ కోసమే ఆలోచించే వ్యక్తి మీ కోసం ఉంటాడనే  కామెంట్స్ చేస్తున్నారు. రెజీనా అప్ కమింగ్ సినీ జర్నీని చూస్తే ఫ్లాష్ బ్యాక్, ముకుత్తి అమ్మన్ పార్ట్ 2 , ది వైవ్స్, సెక్షన్ 108 చిత్రాలు రెజీనా లిస్ట్ లో ఉన్నాయి.  రెజీనా స్టిల్ బ్యాచులర్ అనే విషయం తెలిసిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com