Home

»

Latest News

ర‌వితేజ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా `రామారావు ఆన్ డ్యూటీ` టీజ‌ర్!?

Jan 19, 2022 11:35AM

ప్ర‌స్తుతం చేతినిండా సినిమాలున్న అగ్ర క‌థానాయ‌కుల్లో మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌రు. `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. ఇలా ఐదు చిత్రాల‌తో బిజీగా ఉన్నారీ మాస్ స్టార్.

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 26 ర‌వితేజ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని `రామారావు ఆన్ డ్యూటీ` తాలూకు టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. కాగా, శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు మాస్ మ‌హారాజా. ఆయ‌న‌కి జోడీగా `మ‌జిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్, `క‌ర్ణ‌న్` ఫేమ్ రాజీషా విజ‌య‌న్ క‌నిపించ‌నున్నారు. వేస‌వి కానుక‌గా మార్చి 25న ఈ సినిమా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

Also Read:  ప్ర‌మాదంలో జాన‌కి.. ఏం జ‌రగ‌బోతోంది?

ఇక‌ ఈలోపే ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేసిన `ఖిలాడి` జ‌నం ముందుకు రానుంది. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ కాబోతోంది. ఇందులో సీనియ‌ర్ స్టార్ అర్జున్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా.. ర‌వితేజ‌కి జంట‌గా మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి ఆడిపాడారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com