Home

»

Latest News

Rashmika: రష్మిక అంటే పేరు కాదు బ్రాండ్.. రాయలసీమ ఫీలింగ్ ఉందని అర్ధమవుతుంది 

Apr 4, 2026 10:15AM

 

 

-హిస్టరీ రిపీట్ 
-అరుదైన ఘనత రష్మిక ఖాతాలోకి 
-విజయ్ చెప్తుంది ఏంటి

చూస్తుంటే 2026 సంవత్సరం రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కోసమే వచ్చిందనిపిస్తుంది. మరి సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో   వివాహ బంధంగా మార్చుకోవడం, ప్రధానమంత్రి మోదీని సైతం కలిసి ఆశీర్వాదం తీసుకోవడం, వివాహం చాలా గ్రాండ్ గా జరగడం, రిసెప్షన్ కి చిరంజీవి మొదలుకొని తెలుగు సినిమా మొత్తం తరలి రావడం జరిగింది. ఇప్పుడు మరో రెండు అరుదైన విషయాలు జరిగాయి. అవి విన్నాక  2026 ఆ ఇద్దరిదే అని మీరు కూడా అంటారు. మరి అవేంటో చూద్దాం

రష్మిక మరికొన్ని రోజుల్లో అంటే మే 23 న జపాన్ క్యాప్టిల్ టోక్యోలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మక 'క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్' వేడుకలకి ప్రెజెంటర్ గా హాజరు కానుంది. అంటే సదరు అవార్డ్స్ రష్మిక స్పీచ్ తోనే గ్రాండ్ గా ప్రారంభమవుతాయి. 2024 లోనే ప్రెజెంటర్ గా వెళ్లి ఆ ఘనతని అందుకున్న తొలి ఇండియన్ సినీ సెలబ్రిటీ గా నిలిచింది. ఇప్పుడు రెండో సారి వెళ్తు అరుదైన ఘనతని తన ఖాతాలో ఉంచుకున్నట్లయింది. క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్ విషయానికి వస్తే  జపాన్ లో తెరకెక్కిన ఆ దేశపు యానిమేటెడ్ మూవీస్, వెబ్ సిరీస్ కి చెందిన నటీనటులకి, సాంకేతిక నిపుణలకి క్రాంచి రోల్ యానిమే అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.

also read: Ramayana: ఎవరు ఆ 10000 మంది.. ఇక వార్ స్టార్ట్ అయినట్టేనా

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి 'రణబలి'(Ranabhali)అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు విజయ్, రష్మిక తో ర్యాలీ లాంటిది చేసారు. అనంతరం ఫ్యాన్స్ మీట్ లో విజయ్ మాట్లాడుతు రాయలసీమకి ఎప్పడొచ్చినా నా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. నా లోపల సీమ ఫీలింగ్ ఉందని విజయ్ చెప్పుకొచ్చాడు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com