రష్మిక కాళ్ళు మొక్కిన అసిస్టెంట్!
on Sep 4, 2023

పలువురు సినీ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత సిబ్బందితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. సిబ్బంది ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు.
తాజాగా రష్మిక తన మేకప్ అసిస్టెంట్ సాయి బాబు పెళ్ళిలో సందడి చేసింది. రష్మిక అక్షింతలు వేసి, వధూవరులను ఆశీర్వదిస్తుండగా.. వారు రష్మిక కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. వధూవరులు అలా కాళ్ళకి మొక్కడంతో మొదట కాస్త కంగారు పడిన రష్మిక.. ఆ వెంటనే తేరుకొని నూతన జంటని మనస్ఫూర్తిగా దీవించింది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సినిమాల విషయానికొస్తే రష్మిక చేతిలో ప్రస్తుతం 'యానిమల్', 'పుష్ప: ది రూల్', 'రెయిన్ బో' వంటి బడా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



