రష్మీ కారు యాక్సిడెంట్.. ఒకరి పరిస్థితి విషమం!!!
on Mar 18, 2019

రష్మీ గౌతమ్ జబర్దస్త్ తో మాంచి పాపులర్ అయిన సంగతి తెలసిందే. ఇటీవల ట్విట్టర్లో హాట్ హాట్ గా సమాధానాలు ఇస్తూ పాపులర్ అయిపోయింది. ఏదో ఒక రకండా నిత్యం వార్తల్లో నిలిచే రష్మీ గౌతమ్ కు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆమె కారు విశాఖ గాజువాక ప్రాంతంలో రాత్రి 12 గంటల సమయంలో రోడ్డు దాటుతోన్న ఓ వ్యక్తిని డీకొట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈ యాక్సిడెంట్ లో అతడు తీవ్రంగా గాయపడ్డారని...దగ్గర్లో ప్పైవేటు హాస్పిటల్ కు తరలిచారని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి హాస్పిటల్ ఖర్చు మొత్తం రష్మి భర్తిస్తానని ఒప్పుకోవడంతో కొంచెం గొడవ సద్దుమణిగిందట. అలాగే ఎవరికైతే యాక్సిడెంట్ చేసిందో ఆ ఫ్యామిలీకి ఫైనాన్సియల్ గా సపోర్ట్ చేస్తానని కూడా హామీ ఇచ్చిందట. యాక్సిడెంట్ సమయంలో కారు డ్రైవ్ చేసిందా రష్మీనా, లేక డ్రైవరా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇంత వరకు ఈ విషయంపై రష్మీ గానీ, ఆమె తరఫువారు కానీ స్పందించలేదు. అయితే యాక్సిడెంట్ అయిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఏదైనా అయితే, ఆ సమయంలో రష్మీనే డ్రైవింగ్ చేసుంటే మాత్రం లీగల్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నా యంటున్నారు. ఇప్పటి వరకు దీనిపై పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



