తనకు సినిమాలు రాకపోవడానికి కారణం అదేనంటున్న రాశీఖన్నా..
on Nov 13, 2016

అందంగా, కాస్తంత బొద్దుగా ఉండే రాశీ ఖన్నాకు సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే అవకాశాలు వస్తున్నాయి..కానీ కొన్ని ఛాన్స్ లు మాత్రం రాశీఖన్నాను వరించడంలేదు. దానికి కారణం ఆమె కాస్త బొద్దుగా ఉండటమే. ఈ విషయాన్ని రాశీఖన్నానే స్వయంగా ఒప్పుకుంటున్నారు. సక్సెస్ లు ఉన్నా అవకాశాలు రాకపోవడానికి తన శరీరాకృతే కారణమంటుంది. అంతేకాదు మిగతావారితో పోల్చుకుంటే నేను బొద్దుగానే ఉంటాను. బరువు తగ్గాలనుకుంటాను కానీ, అది సాధ్యం కావడం లేదు. కష్టపడి బరువు తగ్గినా, వెంటనే అంతకు రెట్టింపు బరువు పెరుగుతూ ఉంటాను. అందరూ రెండు గంటలు చేస్తే నేను నాలుగు గంటలు వ్యాయామం చేస్తాను. ఆహారం కూడా ఎక్కువ తీసుకోను. బహుశా నా శరీరతత్వమే అంత అనుకుంటాను. నేను అసలు సినిమాలకి సరిపోనేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది కూడా అంటూ తెగ ఫీలవుతుంది బొద్దు భామ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



