ఇంత జరిగినా ఆ డైలాగ్ ఉంచారట..!
on May 26, 2017

‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ గత కొద్ది రోజులుగా తెలుగు మీడియా అంతా ఈ డైలాగ్ చుట్టూనే తిరుగుతుంది. టీవీ ఆన్ చేసినా..నలుగురు కలిసి మాట్లాడుకున్నా ఈ మాట మీదే. అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన "రారండోయ్ వేడుక చూద్దాం " ఆడియో రిలీజ్ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
"అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు" అంటూ ఆయన అన్న మాటలని ఆడియో వేడుకలో పాల్గొన్న వాళ్లు పట్టించుకోలేదు కానీ..టీవీలో లైవ్ చూసిన జనాలకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా మహిళా సంఘాలు చలపతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు సైతం చేశాయి. మరి ఇంత వివాదానికి కారణమైన అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న డైలాగ్ సినిమాలో ఉంచుతారా..? తీసేస్తారా..? అని చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే దీనిని సినిమాలో అలాగే ఉంచేశారట. ఓ సిన్నివేశంలో చాలా కీలకమైన డైలాగ్ కావడంతో ఫ్లో మిస్సవ్వకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నారట దర్శకనిర్మాతలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



