Home

»

Latest News

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన ధురంధర్.. ఈ నెల 18 న వాళ్ళ గుడికి వెళ్తున్నాను 

Apr 11, 2026 10:14AM

 


ధురంధర్ 2 తో సరికొత్త రికార్డ్స్ దిశగా రణవీర్ 
ఈ నేపథ్యంలో చర్చినీయాంశంగా మారిన క్షమాపణలు 
అసలు కేసు ఏంటి 

ధురంధర్(Dhurandhar)సిరీస్ లో రణవీర్ సింగ్(Ranveer Singh)పాకిస్థాన్ దేశంలోకి ప్రవేశించి హంజా అలీ మజారిగా అక్కడి అరాచక శక్తుల పంచన చేరతాడు. వాళ్లలో ఒకడిగా ఉంటు మనదేశానికి ద్రోహం చేసే వాళ్ళని మట్టుబెడతాడు. అదంతా చూసిన ఎవరికైనా రణవీర్ సింగ్ నిజంగానే అదంతా చేశాడా అనిపిస్తుంది. అంతలా తన క్యారక్టర్ లో లీనమయ్యాడు. ఇప్పుడు అదే రణవీర్ సింగ్ కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో కోర్టుకి క్షమాపణ పత్రాన్ని దాఖలు చేయడం చర్చినీయాంశమయ్యింది. పూర్తి మ్యాటర్ చూద్దాం.

కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)లో చూపించిన చాముండి దైవం గురించి తెలిసిందే. ఆ అమ్మవారు కర్ణాటకలోని మైసూర్ లో ఉన్న ఒక తెగ ప్రజలకి ఇలవేల్పు. గోవాలో గత ఏడాది నవంబర్ లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో చాముండి దెయ్యం అని రణవీర్ సంబోధించాడు. పైగా కాంతార దైవం ఆవహించినప్పుడు రిషబ్ ఎలా ఐతే కళ్ళు తిప్పుతూ పెర్ఫార్మ్ చేస్తాడో ఆ విధంగా కళ్ళు తిప్పి చూపించాడు. అప్పట్నుంచి రణవీర్ పై విమర్శలు వస్తుండటంతో పాటు కర్ణాటక హైకోర్టులో కేసు నమోదయ్యింది. తన ప్రవర్తన విషయంలో రణవీర్ క్షమాపణ చెప్పడంతో పాటు కోర్టుకి తన లాయర్ ద్వారా క్షమాపణ పత్రాన్ని సమర్పించాడు. ఈ విషయంలో పిటిషనర్ తరుపు న్యాయవాది సంతృప్తి చెందకపోవడంతో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సదరు ఆదేశాల్లో రణవీర్ రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో పాటు మైసూర్ లో ఉన్న చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోరింది.


also Read: Allu Arjun: చాలా గర్వంగా ఉంది.. మంత్రులు, ప్రభుత్వ అధికారులకి  కృతజ్ఞతలు


రణవీర్ కూడా మరో సారి క్షమాపణ పత్రాన్ని సమర్పించాడు. సదరు పత్రంలో 'నేను ముంబైలోని సింద్ కుటుంబంలో జన్మించి ఉండటంతో చాముండి అమ్మవారి ఘనతని అర్ధం చేసుకోలేకపోయాను. నేను నిజాయితీగా క్షమాపణలు చెప్తున్నాను. ఈ నెల 18 న మైసూర్ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపాడు.

 

 

  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com