సెన్సేషనల్ కాంబినేషన్.. ఆర్జీవీ దర్శకత్వంలో ఉపేంద్ర!
on Sep 18, 2021
కొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడుతుంది. అలాంటి విభిన్న కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రానుంది. రామ్ గోపాల్ వర్మ- ఉపేంద్ర కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేక స్థానముంది. అయితే కొంతకాలంగా ఆయన వివాదాస్పద సినిమాలు.. అందులోనూ ఎక్కువగా కొత్త వాళ్ళతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన కన్నడ స్టార్ ఉపేంద్రతో సినిమా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు ఎక్కువగా సమాజాన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. అలాంటి ఉపేంద్రతో కలిసి తాను సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఆర్జీవీ ప్రకటించారు.
నేడు(సెప్టెంబర్ 18) ఉపేంద్ర పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఉపేంద్రకు శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీవీ.. తాను ఉపేంద్రతో ఓ యాక్షన్ ఫిల్మ్ తీయబోతున్నట్లు ప్రకటించారు. మరి తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడం ఎప్పుడో మరిచిన ఆర్జీవీ.. ఉపేంద్రతో తీసే సినిమాతో అయినా తనలో ఉన్న పాత ఆర్జీవీని వెలికి తీస్తారేమో చూడాలి.
Also Read