Home

»

Latest News

‘వంగవీటి’ రహస్యాలు

Feb 26, 2016 9:47AM


ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' అనే వివాదాస్పద సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో డిజైన్ రిలీజ్ చేసాడు. రక్త వర్ణంతో కత్తులు, సైకిల్ చైన్ తో ఈ లోగో ఉండటం బట్టి చూస్తే సినిమాలో కావాల్సినంత వయెలెన్స్(హింస) ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడుతూ.... ‘వంగవీటి’కి సంబంధించిన కొన్ని రహస్యమైన విషయాలు తెలుసుకోవడానికి నేను విజయవాడ వెళుతున్న సందర్భంలో నా  ఆనాటి జ్ఞాప‌కాలనుంచి నాకిప్పుడనిపిస్తుంటుంది. విజయవాడ నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవమని...ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు చెప్పినట్లు నేనిది నేర్చుకున్నా అది విజయవాడనుంచే. ‘వంగవీటి’కి సంబంధించి ఆ సబ్జెక్ట్ మీదున్న మమకారంతో ఇప్పుడు వంగవీటి టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాను. సిరాశ్రీ పాటను రాయగా సుశర్ల రాజశేఖర్ సంగీతం అందించాడు అని అన్నారు.

ఇక ఈ సినిమా మొత్తం విజయవాడ రౌడీయిజం చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు విజయవాడలో మాస్ లీడర్‌గా తన ఆధిపత్యం కొనసాగించిన వంగవీటి రంగా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయవాడలో రెండు అగ్రవర్ణం కులాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారిసిందనే అంశాలను ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com