చరణ్ `వినయ విధేయ రాముడే` అంటున్నారు!!
on Feb 5, 2019
`రంగస్థలం` చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ , బోయపాటి శ్రీను దర్శకత్వంలో `వినయ విధేయ రామ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలయ్యాక అసలు రామ్ చరణ్ ఈ కథ ఎలా ఒప్పుకున్నాడంటూ అంతూ సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఈ చిత్రంలో చరణ్ తో బోయపాటి చేయించిన విచిత్ర విన్యాసాలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేశారు. మెగా అభిమానులు ఈ సినిమా మిగిల్చిన అవమానాలు అంత తేలిగ్గా మరచేలా లేరు. `వినయ విధేయ రామ` చిత్రం పరాజయం దగ్గర నుంచి రామ్ చరణ్ పెద్దగా బయటకు కూడా రాలేదు. అయితే ఈ రోజు ` ఈ సినిమా ఫ్లాప్ రామ్ చరణ్ స్పందించాడు. `` అన్ని సినిమాలలాగే `వినయ విధేయ రామ` చిత్రానికి కూడా నాతో పాటు డైరక్టర్, ఇతర సాంకేతిక నిపుణులు కష్టపడ్డారు. కానీ, ఫలితం మాత్రం దక్కలేదు. మీరు చూపించే ప్రేమను ప్రేరణగా తీసుకొని ఇక ముందు మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తానంటూ`` అభిమానుకులకు ఓ లేఖను మీడియా ద్వారా పంపించాడు రామ్ చరణ్. ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరూ ఇలా నిజాయితీ గా తన సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుంటూ లేఖ రాయడం గొప్ప విషయం...నిజంగా చరణ్ వినయ విధేయ రాముడే అంటున్నారు.