ధృవ : సెన్సార్ రివ్యూ
on Nov 21, 2016
వరుస ఫ్లాపులతో తన ఇమేజ్‌కి డామేజ్ తెచ్చుకొన్నాడు రామ్ చరణ్. మరోవైపు తన తోటి హీరోలు హిట్లు మీద హిట్లు కొట్టి దూసుకుపోతున్నారు. ఈ దశలో చరణ్ తన ఖాతాలో ఓ భారీ హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. తన ఆశలన్నీ ఇప్పుడు ధృవ సినిమాపైనే. డిసెంబరు 2న రావాల్సిన ఈ చిత్రం.. 9కి వాయిదా పడింది. అయితే ఈలోగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేశారు. ధృవకి యూ బై ఏ సర్టిఫికెట్ అందింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
ధృవ ఫస్టాఫ్ స్లో నేరేషన్‌తో సాగిందని సమాచారం. కథలోకి వెళ్లడానికి సురేందర్ రెడ్డి కాస్త సమయం తీసుకొన్నాడని, అందుకే ఫస్టాఫ్ అంతా సో. సోగా గడిచిందని తెలుస్తోంది. అయితే.. సెకండాఫ్ మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులతో పరుగులు పెడుతుంట. ఇక్కడే సురేందర్ రెడ్డి స్ర్కీన్ ప్లే మ్యాజిక్ చూపించాడని తెలుస్తోంది. తని ఒరువన్‌కి ఇది రీమేక్ అయినా... సురేందర్ రెడ్డి చరణ్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేశాడట. అవన్నీ బాగా ప్లస్ అయ్యాయని తెలుస్తోంది.
చరణ్‌ని స్టైలీష్ గా చూపించిన విధానం మెగా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుందని చెబుతున్నారు. చరణ్ పాత్ర ఎంత ప్లస్ అయ్యిందో... ప్రతినాయకుడిగా నటించిన అరవింద్ స్వామి పాత్ర కూడా అంతే క్లిక్ అయ్యిందని, అయితే కథానాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌కి అంత స్కోప్ లేదని, ఒక పాటలో కనిపించిందని, ఆమె గ్లామర్ కూడా అంతంత మాత్రమే అని తెలుస్తోంది. కామెడీకి ఎక్కడా స్కోప్ లేకపోవడంతో బీ, సీల్లో ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తని వరువన్ చూడనివాళ్లకు ఈ సినిమా నూటికి నూరుశాతం నచ్చుతుందని, తనివరువన్ ఎక్స్‌పెక్టేషన్లతో వెళ్తే కాస్త నిరాశ పడడం ఖాయమని చెబుతున్నారు. ఓవరాల్‌గా బాక్సాఫీసు దగ్గర ధృవ పైసా వసూల్ సినిమాగా నిలిచిపోతుందని సమాచారం. కచ్చితంగా ఇది చరణ్‌కీ మెగా ఫ్యాన్స్‌కీ గుడ్ న్యూసే.