రామ్‌చరణ్‌తో ‘అన్‌స్టాపబుల్’ షోకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పుడో తెలుసా?
on Dec 30, 2024
వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యగలనని నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ‘అన్‌స్టాపబుల్’ షోను సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. బాలయ్య. ఈ షోకి ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసిన బాలయ్య ఇప్పుడు నాలుగో సీజన్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో వెంకటేష్ షోకి వచ్చి ఆడియన్స్‌ని బాగా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు తాజాగా ‘గేమ్ ఛేంజర్’ హీరో, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. అన్‌స్టాపబుల్ షోకి రాబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ సహచర హీరో అయిన చిరంజీవి కుమారుడు చరణ్‌తో ఈ షో చేయడం ఆయనకు కూడా ఎక్సైటింగ్‌గానే ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ వార్త నిజమేనని తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 31 మధ్యాహ్నం 3 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో అన్‌స్టాపబుల్‌కి సంబంధించిన కొత్త ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. చరణ్‌తోపాటు యూనిట్ సభ్యులు కూడా ఈ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌పై ఆడియన్స్, మెగా అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. బాలయ్య, చరణ్ మధ్య సంభాషణ జరుగుతుంది, చరణ్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ సంక్రాంతికి బాలకృష్ణ, రామ్‌చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అంశాలు కూడా ఈ షోలో తప్పకుండా ప్రస్తావనకు వస్తాయి. ఇవి ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తాయి. సాధారణంగా అన్‌స్టాపబుల్ షోలో ఒక సెలబ్రిటీ వచ్చిన తర్వాత షో మధ్యలో మరో సెలబ్రిటీని ఆహ్వానించడం, వారిని ఫన్ క్రియేట్ అయ్యే ప్రశ్నలు అడగడం మనం చూస్తున్నాం. మరి చరణ్ ఎపిసోడ్‌కి ఎవరిని పిలుస్తారు అనే చర్చ జరుగుతోంది. చరణ్‌కి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్‌ని పిలుస్తారా లేక ఫోన్‌లో మాట్లాడిస్తారా అనేది చూడాలి. అన్‌స్టాపబుల్ షోకి సంబంధించి ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన ఎపిసోడ్స్ కంటే దీనికి ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read