అన్ స్టాపబుల్ 4 కి గెస్ట్ గా గేమ్ ఛేంజర్! ఎన్టీఆర్ నుంచి ఫోన్!
on Dec 29, 2024
ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఆహా' లో ప్రసారమయ్యే నందమూరి లయన్ యువరత్న బాలకృష్ణ(balakrishna)టాక్ షో 'అన్‌స్టాపబుల్'(unstoppable)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.బాలయ్య సినిమా రిలీజ్ రోజు కోసం ఎంత ఎగ్జైట్ గా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురుచూస్తారో,ఆ షో కోసం కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తుంటారు.ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 4 నడుస్తుంది. రీసెంట్ గా వెంకటేష్ గెస్ట్ గా వచ్చి తన అభిమానులనే కాకుండా ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరించాడు.
ఇప్పుడు ఈ షో కి గేమ్ చేంజర్(game changer)రిలీజ్ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)గెస్ట్ గా రాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ టీం కూడా పాల్గొనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 31 జరగనుందని అంటున్నారు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలోస్ప్రెడ్ అవ్వడంతో చరణ్,బాలయ్యఎపిసోడ్ లో ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి.వాటికి చరణ్ సమాధానాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నందమూరి,మెగా అభిమానుల్లో నెలకొని ఉంది.షో మధ్యలో స్పెషల్ గెస్ట్ లు రావడం,కంటెస్ట్ లకి సంబంధించిన సీక్రెట్స్ ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ చేత మాట్లాడించడం కూడా జరుగుతుంటుంది.ఈ నేపథ్యంలో చరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్(ntr)ఫోన్ లో ఏమైనా మాట్లాడతాడా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.ఏది ఏమైనా చరణ్,బాలయ్య ఎపిసోడ్ టిఆర్పి లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే రామ్ చరణ్, బాలయ్య ఇద్దరు కూడా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్(daku maharaj)తో వస్తున్నారు. గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల కాబోతుండగా, డాకు మహారాజ్ జనవరి 12 న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో తమ సినిమాల మధ్య ఉన్న పోటీ గురించి కూడా ఆ ఇద్దరు ఏం మాట్లాడతారో అనే ఆసక్తి అందరిలో ఉంది.
Also Read