రాజు గారి గది-2 ఫస్టాఫ్ రివ్యూ
on Oct 13, 2017
.jpg)
రాజుగారి గది సినిమాకు సీక్వెల్‌గా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది-2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి ఇంత హైప్ రావడానికి కారణం కింగ్ నాగార్జున నటించడమే.. దీనికి తోడు సమంత ఇందులో దెయ్యంగా నటించిందని తెలియడంతో రాజుగారికి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఏదో విషయం లేకపోతే నాగ్ అంత తేలిగ్గా నటించరని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతటి భారీ అంచనాలున్న ఈ మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
ఓ ఇంట్లో ఒకమ్మాయి చనిపోయి ఆత్మగా ఉంటుంది. అదే ఇంట్లోకి అశ్విన్, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్ వెళతారు. రోజు రాత్రి కాగానే రకరకాల శబ్ధాలతో ఆ ఇళ్లంతా భయంకరంగా ఉంటుంది. దీంతో మానసిక వైద్యుడైన నాగార్జునను పిలిపించి దెయ్యాన్ని బయటికి పంపేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో అసలు దెయ్యం వెనుక మిస్టరీ ఏంటీ అనేదే కథ. షకలక శంకర్, వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జనాల్ని భయపెడుతుంది. అయితే ఫస్టాఫ్‌లో అక్కడక్కడా రాజుగారి గది ఛాయలు కనిపించడంతో ఆడియన్స్ కాస్త బోర్ ఫీలయ్యారట. పూర్తి రివ్యూ కోసం తెలుగువన్‌ని ఫాలో అవ్వండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



