యూట్యూబ్ లో కబాలీ టీజర్ భీభత్సం..!
on May 2, 2016

వరస ఫ్లాపులతో కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కొచ్చాడయాన్, లింగా సినిమాలు ఆర్ధికంగా దెబ్బ తీయడంతో పాటు రజనీకి హిట్ ను కూడా దూరం చేశాయి. అందుకే తన రేంజ్ ను ఆకాశానికి తీసుకెళ్లిన భాషా తరహా సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడు. రజనీ మళ్లీ సీన్ లోకి ఎంటరవ్వగానే, చాలా రోజుల పాటు ఖాళీగా ఉన్న ఆయన అభిమానులు లేచి జూలు విదిలించారు. కబాలీ టీజర్ యూట్యూబ్ లో రిలీజైన ఒకరోజుకే లేదో రజనీ మానియా, సూపర్ స్టార్ ఫ్యాన్ క్రేజ్ కలిపి సంచలనాలు సృష్టిస్తోంది. తమిళ టీజర్ ను ఇప్పటి వరకూ దాదాపు 54 లక్షల మంది చూశారు. లేటుగా రిలీజైనా, తెలుగు టీజర్ కూడా 5.81 లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. తెల్లగడ్డంతో మాఫియా డాన్ గా సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో కూడా మారుమోగుతున్నాయి. ముఖ్యంగా కబాలీ రా అంటూ చెప్పే టైం లో రజనీ స్టైల్ కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టీజర్ చివరిలో కుర్ర రజనీ జుట్టు సరిచేసుకుంటూ స్పీడ్ గా బయటికి వస్తున్న షాట్ విజిల్స్ కొట్టిస్తోంది. టీజర్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంటే, ఇక సినిమా రిలీజైన తర్వాత ఎలా ఉంటుందో..!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



