'మా' అధ్యక్ష బరిలో రాజేంద్రప్రసాద్
on Mar 3, 2015
.jpg)
సినిమాలలో నవ్వులతో ప్రజలను మెప్పించిన నటుడు డా. రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడి కోసం జరగనున్న ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. ఏదో ఒక సేవారంగంలో ఉండాలని అనుకుంటున్నానని, ఈ లోపు మా ఎన్నికలు రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఎన్నికల బరిలో దిగుతున్నానని చెప్పారు. గతంలో ‘మా’ ఎన్నికలలో పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ మురళీమోహన్‌పై కేవలం ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నటుడిగా తన కెరీర్ పై దృష్టి సారించారు. ఈసారైనా 'మా' అధ్యక్ష పదవి రాజేంద్రప్రసాద్‌ని వరిస్తుందో లేదో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



