రాజశేఖర్ పక్కన ఈసారి హీరోయిన్గా...
on Sep 16, 2019
తెలుగులో నందితా శ్వేత కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రామిసింగ్ హీరోయిన్ల లిస్టులో ఒకరు అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు విజయాలు దక్కలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటిగా పేరు తెచ్చుకుంటూ, అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతానికి తెలుగులో విడుదలైన నందితా శ్వేత లాస్ట్ సినిమా 'కల్కి'. అందులో రాజశేఖర్ హీరో. హీరోయిన్ అదా శర్మ. ముస్లిమ్ యువతిగా నందితా శ్వేత కీలక పాత్ర చేసింది. ఈసారి మాత్రం రాజశేఖర్ పక్కన ఆమెకు హీరోయిన్గా అవకాశం వచ్చింది. తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. అందులో నందితా శ్వేతను హీరోయిన్గా ఫైనలైజ్ చేశారని టాక్. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదొక థ్రిల్లర్ సినిమా. స్క్రీన్ ప్లే ఎగ్జైటింగ్ గా ఉంటుందట.