Home

»

Latest News

Rajasekhar: రాజశేఖర్ దశ తిరగబోతుందా!

Apr 06, 2026

 

 

-బైకర్ తో సందడి చేస్తున్న రాజశేఖర్ 
-శర్వా తండ్రిగా సూపర్ గా చేసాడని కితాబు 
-మరి నెక్స్ట్ చిత్రాలు ఏంటి 


యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్(Rajasekhar).. హీరోగా ఎన్నో అఖండమైన విజయాల్ని చూసిన హిస్టరీ నేమ్. తోటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సినిమాలకి పోటీగా వచ్చి విజయాల్ని చవి చూసాడు. ముఖ్యంగా మగాడు, అంకుశం, అన్న, శివయ్య, సింహరాశి, ఓం సినిమాల్లో ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ కైతే అభిమానులు,ప్రేక్షకుల చేత పూనకాలు కూడా తెప్పించాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా బ్యాండ్ అంబాసిడర్. చాలా మంది మహిళలు రాజశేఖర్ ని తన అన్నయ్యగా భావించే వారు. ఈ విషయంలో సిల్వర్ స్క్రీన్ కూడా పోటీపడుతోంది. అంతలా రాజశేఖరుడి యాక్టింగ్ ని చూసి మురిసిపోతుంటుంది. మరి అలాంటి రాజశేఖరుడి అప్ కమింగ్ సినీ జర్నీపై ఒక లుక్ వేద్దాం.

రాజశేఖర్ ప్రస్తుతం థియేటర్స్ లో 'బైకర్'(Biker)మూవీతో సందడి చేస్తున్నాడు. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులైతే రాజశేఖర్ బైకర్ కి అతి పెద్ద ప్లస్ గా నిలిచాడని, అసలు అయన కాకుండా వేరే వాళ్ళు చేసి ఉంటే బైకర్ పరిస్థితి మరోలా ఉండేదని నిర్మొహమాటంగా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నట్టుగానే  శర్వానంద్ తండ్రిగా సంతోష్ నారాయణ క్యారక్టర్ లో ఇరగదీసాడు. దీంతో రాజశేఖర్  హీరోగా కాకపోయినా ముఖ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ తమని అలరించాలని కోరుతున్నారు. రాజశేఖర్ కూడా అందుకు సిద్దంగానే ఉన్నాడు. కానీ అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. నిజానికి ఇప్పుడు నడుస్తున్న పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో రాజశేఖర్ కి ఆవేశం, పొగరుతో కూడిన సరైన క్యారక్టర్ పడితే సినిమా రేంజ్ ఊహకి కూడా అందదు. 

also read: Allu arjun: అల్లు అర్జున్ సాంగ్ అరుదైన రికార్డు. ఏకంగా 93కోట్ల వ్యూస్ 

2023 లో నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ లో కీలక రోల్ లో కనిపించాడు. ఆ మూవీలో కూడా తనకి మాత్రమే సాధ్యమయ్యే పెర్ ఫార్మ్ తో ఇరగదీసాడు. ఆ తర్వాత బైకర్ నే. అంటే మళ్ళీ మూడేళ్ళకి. కాకపోతే బైకర్ విషయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి(Chiranjeevi)ఇంట్లోనే చిన్నప్పట్నుంచి పెరిగిన వ్యక్తి శర్వానంద్. పైగా రామ్ చరణ్ ఎంతో శర్వానంద్ కూడా అంతే. ఈ విషయాన్నీ చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్(Ram Charan)శర్వానంద్(Sharwanandh)కూడా చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మరి బైకర్ ని చిరంజీవి, చరణ్ తో చాలా మంది సినీ పర్సనాలిటీస్ చూసే అవకాశం ఉంది. పై పెచ్చు బైకర్ ని నిర్మించిన యువి క్రియేషన్స్ నే విశ్వంభరని నిర్మిస్తుంది. కాబట్టి రాజశేఖర్ కి ఈ సారి మరిన్ని అవకాశాలు వెంట వెంటనే వచ్చే అవకాశం ఉంది.ఏది ఏమైనా రాజశేఖర్ లాంటి హీరోకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండదు. పాన్ ఇండియాని షేక్ చేసి మళ్ళీ తన కోసం థియేటర్స్ కి పరుగెత్తేలా చేసే క్యారక్టర్ స్టిల్  కొంత మంది  మేకర్స్ మెదళ్లలో మెదులుతూనే ఉండుంటుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com