
దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ మెగాఫోన్ ఎప్పుడు పడతారో? దర్శకుడిగా స్వంత సినిమా ఎప్పుడు తీస్తారో? ఇప్పట్లో చెప్పడం కష్టమే. రాజమౌళి సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న కార్తికేయ, నిర్మాతగా 'ఆకాశవాణి' సినిమా చేస్తున్నారు. రాజమౌళి వద్ద చిరకాలంగా దర్శకత్వ శాఖలో పని చేస్తున్న అశ్విన్ గంగరాజు ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్ డబ్బింగ్ కార్యక్రమాలు త్వరలో స్టార్ట్ చేస్తారట.
దర్శకుడు-నటుడు సముద్రకని 'ఆకాశవాణి'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనను తీసుకోవడం వెనుక అసలు కారణం... తమిళంలో విడుదల చేయాలనే ఆలోచన అట. తమిళంతో పాటు హిందీ, మలయాళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒకటే బ్యాలన్స్ ఉందట. అది ఫినిష్ చేశాక, ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇందులో మూడు పాటలు ఉన్నాయట.






