Home

»

Latest News

Rahul Ramakrishna: ఎంఎల్ఏకి రాహుల్ రామకృష్ణ కౌంటర్.. డ్రగ్ టెస్ట్, లైడిటెక్టర్‌ టెస్ట్ 

Apr 3, 2026 10:41AM

 

-ఎక్స్ వేదికగా రాహుల్ రామకృష్ణ ట్వీట్ 
-డ్రగ్ టెస్ట్ కి నాతో మాటు మావాళ్లు రెడీ 
-మీరు ఆ పని చేస్తారా!


కామెడీనే కాదు సీరియస్ అండ్ సిన్సియర్ క్యారెక్టర్స్ ని కూడా ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేయగలనని నిరూపించిన నటుడు రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna). పైగా రామకృష్ణతో సహా చాలా మంది కనిపెట్టారో లేదో గాని, రామకృష్ణ పోషించిన సీరియస్ క్యారెక్టర్స్ కథకి చాలా ముఖ్యమైనవి. భరత్ అనే నేను, ఆర్ఆర్ ఆర్ వంటి చిత్రాల్లోని క్యారెక్టర్స్ నే  ఉదాహరణ. రీసెంట్ గా రాహుల్ రామకృష్ణ ఒక కాంగ్రెస్ ఎంఎల్ఏ కౌంటర్ ఇవ్వడం చర్చినీయాంశమయ్యింది. ఆ వివరాలేంటో చూద్దాం.

కొన్నిరోజుల క్రితం తెలంగాణా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి(Anirudh Reddy)మాట్లాడుతు 'డ్రగ్స్‌ యాక్టివిటీ  సినిమా పరిశ్రమలోనే ఎక్కువగా జరుగుతుంది. స్టార్‌ హీరోలు ప్రతి 90 రోజులకి ఒకసారీ డ్రగ్స్‌ టెస్టులు చేయించుకోవాలి. దీంతో డ్రగ్స్‌ టెస్టులో క్లీన్‌చీట్‌ పొందితే ఫ్యాన్స్  కూడా డ్రగ్స్‌ జోలికి వెళ్లకుండా ఉంటారనే వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా రాహుల్ రామకృష్ణ స్పందిస్తు 'డ్రగ్స్‌ టెస్టు అంశంలో వెంటనే జీవో జారీ చేస్తే  సినిమా వాళ్లంతా డ్రగ్స్‌ టెస్టులు, మీకు లైడిటెక్టర్‌ టెస్టులు చేయించుకుందాం. ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం చేద్దాం. అప్పుడే ప్రజలు మీ మాటలు నమ్ముతారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.

also read:  Biker Movie Review: బైకర్ మూవీ రివ్యూ

రాహుల్ రామకృష్ణ గత ఏడాది రామ్ పోతినేని,ఉపేంద్రల ఆంధ్రకింగ్ తాలూకాలో కనిపించాడు. ఇంకా కొత్త చిత్రం ప్రకటన రాలేదు. రాహుల్ రామకృష్ణ స్వస్థలం సికింద్రాబాద్.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com