దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంటిపై యువకుడి దాడి..!
on Jun 10, 2016
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంటిపై దాడి జరిగింది. రాఘవేంద్రరావు శ్రీరామదాసు సినిమాకు తన కథను వాడుకున్నారని ఆరోపిస్తూ ఆయనతో గొడవకు దిగాడు రవీంద్ర అనే వ్యక్తి. గురువారం సాయంత్రం, కార్లో ఇంటినుంచి స్టార్ట్ అవుతుండగా, అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఆయన కారుకు అడ్డం వచ్చాడు. రాఘవేంద్రరావు ను తిడుతూ కారు డోరు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. వాచ్ మ్యాన్ ను కూడా పక్కకు తోసేసి, ఆయన్ను బయటికి లాగే ప్రయత్నం చేశాడు. ఆయన అసలు విషయం అడిగితే, రామదాసు కథ తనదే అని, తన కథ వాడుకుని కనీసం పేరు కూడా వేయకుండా మోసం చేశారంటూ ఆయన్ను తిట్టాడు.
ఈ కథ భారవి ఇచ్చాడంటూ ఆయన చెప్పినా ఆ కుర్రాడు వినిపించుకోకపోవడంతో, చేసేది లేక రాఘవేంద్రరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినా, రవీంద్ర మాత్రం ఆగలేదు. రాడ్ తీసుకుని ఆయన ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆడి, బెంజ్, సాంట్రో కార్లను ధ్వంసం చేసి, అడ్డు రాబోయిన వ్యాచ్ మ్యాన్ పై దాడి చేశాడు. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, ఆయనపై కూడా దాడికి దిగాడు. ఎట్టుకేలకు వాచ్ మ్యాన్ తో కలిసి అతన్ని పట్టుకుని పోలీసులు అప్పగించాడు ప్రకాష్. రవీంద్ర పై కేసు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
