రాశీ ఖన్నా.. ఓ సైకో కిల్లర్!
on Jun 13, 2021
ఇప్పటివరకు రాశీ ఖన్నా అంటే సాఫ్ట్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్. త్వరలో ఆ లెక్క మారనుంది. ఈ చక్కని చుక్క.. త్వరలో సైకో కిల్లర్‌గా దర్శనమివ్వనుంది. అయితే.. సినిమా కోసం కాదు.. ఓ వెబ్ - సిరీస్ కోసం రాశి ఈ అవతారమెత్తనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్.. దిగ్గజ ఓటీటీ సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' కోసం ఓ వెబ్ - సిరీస్ చేయనున్నాడు. బ్రిటీష్ టీవీ సీరీస్ 'లూథర్'కి రీమేక్ వెర్షన్ గా 'రుద్ర - ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్' పేరుతో రూపొందనున్న ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా కోసమే రాశి సైకో కిల్లర్ పాత్రలో దర్శనమివ్వనుందట. జూలై 21 నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ముంబయి పరిసర ప్రాంతాల్లో జరుగనుందని సమాచారం. మరి.. ఈ నెవర్ సీన్ బిఫోర్ రోల్‌లో రాశి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం రాశి చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు తెలుగు చిత్రాలు ('థాంక్ యూ', 'పక్కా కమర్షియల్'), ఐదు తమిళ సినిమాలు, ఒక మాలీవుడ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో నటిస్తోంది రాశి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
