బరస్ట్ అవుతున్న పివీపీ..!
on May 28, 2016
కష్టపడి డబ్బు పెట్టి సినిమాలు చేస్తున్నా, సక్సెస్ రాకపోతే ఫ్రస్టేషన్ ఎక్కువగానే ఉంటుంది. ఆ అసహనాన్ని ఎక్కువ కాలం అణిచి ఉంచడం కష్టం. భారీ సినిమాల నిర్మాతలకైతే మరీ కష్టం. ఇప్పటికే చాలా భారీ ఖర్చుతో కూడిన సినిమాలు నిర్మించిన పివిపి ఇన్నాళ్లూ ఉన్న సహనం, బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తో బద్ధలైపోయింది. తన మనసులోని కోపాన్ని, అసహనాన్ని, వేదననూ ఒకేసారి వెళ్లగక్కేస్తున్నాడీయన. మామూలుగా అయితే ఫ్లాప్ సినిమాను కూడా హిట్ అని చెప్పుకోవడం, కష్టపడి స్మైల్ మెయింటెయిన్ చేయడం లాంటివి చేస్తారు నిర్మాతలు. ఇన్నాళ్లూ పివిపి కూడా ఇదే బాటలో ఉన్నాడు. అయితే బ్రహ్మోత్సవం తర్వాతి నుంచి మాత్రం బాగా నిక్కచ్చిగా ఉండాలని ఫిక్సైపోయాడట. ప్రతీ విషయాన్ని పైకే చెప్పేసి ఓపెన్ గా ఉండాలనుకుంటున్నాడట. మీడియా ప్రెస్ మీట్స్ లో కూడా డైరెక్ట్ గానే దర్శకులను విమర్శించేస్తున్నాడు. మన దర్శకులకు, హీరోలకు, ఒక్కొక్కళ్లకు అహం చాలా ఎక్కవని, డబ్బు అంటే కనీస గౌరవం కూడా ఉండదని, వీళ్ల కారణంగానే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తగ్గిపోతుందని, తనకు ఫ్లాప్ ఇచ్చిన ప్రతీవాళ్లనూ ఏకిపారేశాడు. ఇప్పుడైతే సినిమా లాస్ వచ్చిన చిరాకులో బరస్ట్ అయిపోయాడు. మరి తర్వాతి నుంచి కూడా ఇలాగే మెయింటెయిన్ చేస్తాడా..చూద్దాం.