మెగాస్టార్ పుట్టినరోజుకి 'పుష్ప-2' లాంచ్!
on Aug 21, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ముఖ్యంగా నార్త్ లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది. ఈ మూవీ పార్ట్-2 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
'పుష్ప: ది రూల్' పేరుతో రానున్న పార్ట్-2 కోసం ప్రేక్షకుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పార్ట్-1 వచ్చి 8 నెలలు దాటిపోయినా ఇంతవరకు పార్ట్-2 కి సంబంధించి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తాజాగా ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. రేపు(సోమవారం) పూజా కార్యక్రమాలతో పుష్ప-2 ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే రేపు(ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం.
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
