`పుష్ప` రన్ టైమ్.. తగ్గేదేలే!
on Dec 11, 2021

``తగ్గేదే లే`` అంటూ డిసెంబర్ 17న `పుష్ప - ద రైజ్`తో మాస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. `ఆర్య`, `ఆర్య 2` తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో బన్నీ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ - ఇండియా మూవీగా ఎంటర్టైన్ చేయనుంది.
'ఊ అంటావా మావ'.. సమంత తగ్గేదేలే!
ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రైజ్` రన్ టైమ్ ఎంత సేపు ఉంటుందో తాజాగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు. 2 గంటల 59 నిమిషాల పాటు అంటే దాదాపుగా మూడు గంటల పాటు ఈ సినిమా నడుస్తుందట. అయితే, నిడివి ఎక్కువైనా ఎక్కడా స్లోగా ఉండదని, రేసీగా మూవీ సాగుతుందని వారు తెలపడం విశేషం. మరి.. రెండు భాగాలుగా రాబోతున్న `పుష్ప`కి ఫస్ట్ పార్ట్ కే ఇంత రన్ టైమ్ ఉంటే.. సెకండ్ పార్ట్ కి ఇంకెంత డ్యూరేషన్ ఉంటుందో చూడాలి.
అడవి బాటలో అప్ కమింగ్ తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్!
కాగా, `పుష్ప - ద రైజ్`లో బన్నీకి జంటగా రష్మికా మందన్న నటించగా.. సమంత ప్రత్యేక గీతంలో చిందులేసింది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



