అన్ని భాషల్లోనూ బన్నీ నోట అదే మాట.. 'తగ్గేదే లే'!
on Dec 10, 2021

అల్లు అర్జున్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ సుకుమార్ రూపొందించిన 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో బన్నీ "తగ్గేదే లే" అనే ఊతపదంతో అలరించనున్నాడు. ఇప్పటికే ఈ ఊతపదం ఓ రేంజ్‌లో జనంలో పాపులర్ అయ్యింది. సందర్భం వచ్చినప్పుడల్లా "తగ్గేదే లే" అంటూ జనం దాన్ని వాడుతున్నారు. బుల్లితెర మీదా ఈ మాట తరచూ వినిపిస్తోంది.
అంతగా పాపులర్ అయిన 'తగ్గేదే లే' అనే మాటకు ఇతర భాషల్లో ఏ పదాన్ని వాడబోతున్నారు? తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ.. ఆఖరుకి హిందీ వెర్షన్‌లోనూ బన్నీ నోటివెంట 'తగ్గేదే లే' అనే ఊతపదమే వినిపించనుంది. ఆ పదం బాగా పాపులర్ అయ్యింది కాబట్టి, భాషలకు అతీతంగా ఆ ఊతపదాన్ని అన్ని భాషల వెర్షన్లలోనూ ఉపయోగిస్తున్నట్లు ధ్రువీకరించారు నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.
Also read: ఈ లోకం నీకు తుపాకి ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. 'పుష్ప' ట్రైలర్ బెస్ట్ మూమెంట్స్!
కాగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తక్కువగా ఉండటం వల్ల ఆ మేరకు కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని వారు చెప్పారు. అయితే అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. స్పెషల్ షోలు, అదనపు షోలకు అనుమతి లభిస్తే వేస్తామని కూడా వారు తెలిపారు.
Also read: షణ్ముఖ్ అసలు క్యారెక్టర్ బయటపడింది.. ఇంత నీచమా!
సుకుమార్ 'పుష్ప'ను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రెండో భాగం షూటింగ్ 2022 ఫిబ్రవరిలో మొదలు పెడతామని నిర్మాతలు వెల్లడించారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ సమకూర్చిన 'పుష్ప: ది రైజ్'కు మిలోస్లావ్ క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ సమకూర్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



