`పుష్ప` టీజర్ ఎప్పుడంటే..
on Mar 1, 2021
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా `పుష్ప`. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బన్నీకి జోడీగా కన్నడ కస్తూరి రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయిందని టాక్.
ఇదిలా ఉంటే.. `పుష్ప` టీజర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న `పుష్ప` టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాగా, `అల వైకుంఠపురములో` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత అల్లు అర్జున్ కథానాయకుడిగానూ - `రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ దర్శకత్వంలోనూ వస్తున్న సినిమా కావడంతో `పుష్ప`పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆగస్టు 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న `పుష్ప`కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read