పుష్పరాజ్ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఖాన్స్ కూడా టచ్ చేయలేరు!
on Dec 24, 2024
పుష్ప-2 చిత్రం విడుదలైన రోజు నుంచే ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మూడు వారాలు కూడా పూర్తి కాకుండానే వరల్డ్ వైడ్ గా రూ.1500 కోట్లు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో టాప్-3 లో నిలిచింది. ఇక హిందీ గడ్డ మీద ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి, అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. (Pushpa 2 The Rule)
హిందీ గడ్డ మీద ఇప్పటిదాకా రూ.700 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన సినిమా లేదు. అలాంటిది పుష్ప-2 చిత్రం 19 రోజుల్లోనే రూ.700 కోట్ల నెట్ క్లబ్ లో చేరి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అప్పట్లో బాహుబలి-2 హిందీలో రూ.400 కోట్ల క్లబ్, రూ.500 కోట్ల క్లబ్ స్టార్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు రూ.700 కోట్ల క్లబ్ ని స్టార్ట్ చేసిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఒక తెలుగు సినిమా.. హిందీ గడ్డ మీద, హిందీ సినిమాలను వెనక్కి నెట్టి.. ఈ ఫీట్ సాధించడం అనేది నిజంగా గొప్ప విషయం.