పుష్ప 2 పై కేసు వేసిన వ్యక్తికి జరిమానా..డబ్బులు ఎవరికి చెల్లించాలో తెలుసా
on Dec 3, 2024
అల్లు అర్జున్(allu arjun)మూడేళ్ళ తర్వాత పుష్ప 2(pushpa 2)తో సిల్వర్ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.ఈ నెల 5 న విడుదల అవుతున్న ఈ మూవీ మీద,అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఈ మూవీ మీద తెలంగాణ హైకోర్టులో ఒక కేసు నమోదయ్యింది.ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో పుష్ప 2 తెరకెక్కింది కాబట్టి, ఈ చిత్రాన్ని నిలిపేయాలని శ్రీశైలం అనే వ్యక్తి కేసు వేసాడు.
ఈ విషయంపై సెన్సార్ బోర్డ్ తరుపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టులో తన వాదనలని వినిపించడం జరగగా,ఊహాజనిత ఆరోపణల ఆధారంగా సినిమాని నిలుపుదల చెయ్యలేమని హైకోర్టు కేసుని కొట్టి వెయ్యడం జరిగింది.పైగా కేసువేసి కోర్టు సమయం వృధా చేసినందుకు శ్రీశైలంకి జరిమానాని కూడా విధించింది.ఆ జరిమానా మొత్తాన్ని స్వచ్చంద సంస్థకు అందించాలని తన ఆదేశాల్లో స్పష్టం చెయ్యడం జరిగింది.
ఇక అధిక టికెట్ రేట్ల పై కూడా వేసిన కేసుని తెలంగాణ హైకోర్టు ఈ నెల పదిహేడుకి వాయిదా వేసింది. పుష్ప 2 లో అల్లు అర్జున్ సరసన రష్మిక(rashmika)జత కట్టగా సుకుమార్(sukumar) దర్శకత్వంలో మైత్రి మూవీస్(mythri movies)అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది.
Also Read