Home

»

Latest News

పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి సినిమా వ‌చ్చే స్పెష‌ల్ డేట్ ఇదే!

Jan 28, 2022 3:23PM

 

పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి సినిమా 'జేమ్స్' త్వ‌ర‌లో ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు రాబోతోంది. రెండు రోజుల క్రితం జ‌న‌వ 26 రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా 'జేమ్స్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర్‌లో సోల్జ‌ర్‌గా క‌నిపిస్తున్నారు క‌న్న‌డ సూప‌ర్‌స్టార్‌. యుద్ధ‌భూమిలో నిల్చొని వీరోచిత పోరాటం చేస్తున్న‌వాడిలా మెషీన్ గ‌న్ ప‌ట్టుకొని ఉన్నారాయ‌న‌. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ వెలువ‌డ‌టం ఆల‌స్యం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. 

ఇంత‌కీ 'జేమ్స్‌'ను పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్‌పై ఎప్పుడు చూసే అవ‌కాశం ల‌భిస్తుంది?  హోలీకి ఒక రోజు ముందు మార్చి 17న ఆ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం. ఆరోజు పునీత్ జ‌యంతి కూడా! 'జేమ్స్' మూవీ ఎప్పుడు రిలీజ‌వుతుందా అని మొత్తం క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. ఆ సినిమాని చూడ్డం ద్వారా పునీత్‌కు ఘ‌న నివాళి అర్పించ‌డానికి ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా ఆత్రుత‌తో ఉంది.

పునీత్ ఆక‌స్మిక మృతితో 'జేమ్స్' రిలీజ్ ప్లాన్స్ అన్నీ త‌ల‌క్రిందుల‌య్యాయి. అయితే ఇప్పుడు ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా రిలీజ‌వుతుండ‌టం ఊర‌ట‌నిచ్చే అంశం. పునీత్ జ‌యంతి వ‌చ్చే ఆ వార‌మంతా.. అంటే, మార్చి 17 నుంచి 23 వ‌ర‌కు క‌ర్నాట‌క‌లోని సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మొత్తం జేమ్స్ మూవీని మాత్ర‌మే ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

చేత‌న్ కుమార్ డైరెక్ట్ చేసిన 'జేమ్స్' మూవీలో అను ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌కాంత్‌, శ‌ర‌త్‌కుమార్‌, తిల‌క్ శేఖ‌ర్, ముఖేష్ రిషి ఇత‌ర కీల‌క పాత్ర‌ధారులు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com