Home

»

Latest News

ప్రభాస్ కి స్టార్ డమ్ నేనే ఇచ్చా.. మహేష్ ని అవమానించారు

Aug 3, 2026 7:35PM

 

 

ప్రభాస్(Prabhas).. మహేష్ బాబు(Mahesh Babu)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్  గా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సెల్యులాయిడ్ పై బొమ్మ  పడితే తొలి రోజు వచ్చే కలెక్షన్స్ లెక్కపెట్టడానికి మిషన్స్ కూడా చాలవు. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఏం ఎస్ రాజు.. నిర్మాతగా తెలుగు చలన చిత్ర సీమలో ఈ పేరు సృష్టించిన ప్రభంజనం మాములు ప్రభంజనం కాదు.  ఆ హిట్ హిస్టరీ చూసిన తర్వాత జెన్ జి సినీ బ్యాచ్ మనకి తెలియాల్సింది చాలా ఉందని నోరెళ్ళ బడుతుంది. ముచ్చటగా మూడు చెప్పుకోవాలంటే ఒక్కడు, వర్షం, దేవి. ఈ నెల 14 న ఆయనే డైరెక్టర్ గా 'అగధ' అనే కొత్త చిత్రంతో వస్తున్నాడు. ఈ సందర్భంగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏం ఎస్ రాజు గారు మాట్లాడుతు నేను వర్షం సినిమా తీసేటప్పుడు ప్రభాస్ పై ఎలాంటి అంచనాలు లేవు. వర్షం ముందు వచ్చిన సినిమాలు కూడా సరిగా ఆడలేదు. కానీ వర్షం మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ తెచ్చింది. వర్షం వల్లనే ఛత్రపతి సినిమా తీశారు. ఆ తర్వాత ప్రభాస్ తో పౌర్ణమి తెరకెక్కించాను. కానీ ప్రభాస్ పై అంచనాలు పెరిగిపోవడంతో పౌర్ణమి డిజాస్టర్ గా నిలిచింది. కానీ సినిమా మాత్రం బాగుంటుంది. అందుకే స్టార్ డమ్ అంటే నాకు భయం.

Also read: ఓటీటీ కంపెనీల టార్చర్..  వాళ్ళ బతుకు బస్టాండ్ పాలేనా!

 మహేష్ తో తెరకెక్కించిన 'ఒక్కడు' కి ఎక్కువ మొత్తంలో ఫైనాన్స్ చేయకుండా మనసంతా నువ్వే తో  వచ్చిన డబ్బు మొత్తం ఒక్కడుకి ఖర్చు చేశాను.  ఒక్కడికి ముందు మహేష్ కి సరిగా సక్సెస్ లేకపోవడంతో బయ్యర్లు తక్కువ రేటుకి అడిగేవారు. మహేష్ ని అవమానించే విధంగా మాట్లాడే వారు.దీంతో నేనే ఓన్ గా రిలీజ్ చేసానని చెప్పుకొచ్చాడు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com