దిల్‌రాజుకు అరుదైన గౌరవం
on Oct 25, 2016
డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు తనదైన సేవలు అందించిన దిల్‌రాజుకు అరుదైన గౌరవం దక్కింది. తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాదను నిర్మించి..తెలుగు సినిమాకు మాటలు నేర్పిన ప్రఖ్యాత దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి పేరు మీదుగా ఆకృతి సంస్థ గత 23 ఏళ్లుగా అవార్డు అందజేస్తోంది. ఈ ఏడాదికి గానూ దిల్‌రాజును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 28న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి చేతుల మీదుగా దిల్‌రాజుకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఆకృతి నిర్వాహకులు తెలిపారు.