మెరుగైన వైద్యం కోసం ఫారెన్ కు శ్రీతేజ్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే...
on Feb 2, 2025
పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. దాదాపు రెండు నెలల నుంచి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. కానీ ఇంతవరకు సాధారణ స్థితికి రాలేదు. దీంతో అతని ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం శ్రీతేజ్ ను విదేశాలకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు తాజాగా పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త కుదుటపడిందని వైద్యులు తెలపడంతో.. బన్నీ వాసు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, అల్లు అర్జున్ సూచనతో శ్రీతేజ్ కు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడిందనే వార్త కుటుంబ సభ్యులలో కాస్త ధైర్యాన్ని నింపే అవకాశముంది. అలాగే ఫారెన్ తీసుకెళ్లడం వల్ల శ్రీతేజ్ కొంచెం త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
