ప్రేమమ్ ఫ్లాప్ గ్యారెంటీనా???
on Oct 5, 2016

మలయాళంలో ఘన విజయం సాధించడమే కాకుండా... అక్కడ విమర్శకుల ప్రసంశల్ని కూడా అందుకొన్న సినిమా ప్రేమమ్. తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజులో ఉంటాయో అర్థం చేసుకోవొచ్చు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రీ రిలీజ్ టాక్ మాత్రం.. నిరాశ పరుస్తోంది. సినిమా స్లోగా ఉందని, ప్రేమమ్ ఫీలింగ్‌ని క్యారీ చేయలేకపోయిందన్నది ల్యాబ్ రిపోర్ట్. ఈ సినిమా కేవలం ఏ క్లాస్ ఆడియన్స్‌కి మాత్రమే పరిమితమని, బీసీలకు అస్సలు ఎక్కకపోవొచ్చని ఇప్పటికీ ఈ సినిమా చూసినవాళ్లు చెప్పేస్తున్నారు. మరోవైపు నాగచైతన్య మాటల్ని బట్టి చూసినా ప్రేమమ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి.
''మలయాళ ప్రేమమ్‌ని ఊహించుకొని ఈ సినిమా చూడొద్దు'' అంటూ చైతూ చెబుతోంటే... కచ్చితంగా డౌట్ గానే ఉంది. దానికి తోడు రీమేక్ సినిమాల్లో ఫీల్ తీసుకునిరావడం చాలా కష్టం. కమర్షియల్ సినిమాలు ఎలా తీసినా నడుస్తాయి. కానీ ప్రేమమ్ అనేది ఫీల్ గుడ్ మూవీ. మాతృకలో ఉన్న ఫీల్ క్యారీ చేయడంలో అటూ ఇటూ అయితే.. ఇక సినిమా సంగతి అంతే ఇక. దానికి తోడు ఈ సినిమాలో కామెడీ ఏమాత్రం వర్కవుట్ కాలేదని, సెకండాఫ్ లెంగ్తీగా అనిపిస్తోందని చెబుతున్నారు. మరి ఇవన్నీ నిజాలైతే.. ప్రేమమ్ బాక్సాఫీసు దగ్గర రాణించడం కష్టమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



