ENGLISH | TELUGU  

ప్రేమ గీమ తస్సాదియ్య మూవీ రివ్యూ

on Jul 4, 2024



మూవీ : ప్రేమ‌ గీమ తస్సాదియ్య
నటీనటులు: సౌమ్య పాండే, కిరణ్ నైరుత్, విక్రమ్ వీర, మమత, శుభలేఖ సుధాకర్, టి‌.ఎన్.ఆర్, విజయమూర్తి, జబర్దస్త్ రాజమౌళి,  మోనాలీసా
ఎడిటింగ్: తిరుపతి రెడ్డి 
సినిమాటోగ్రఫీ: సత్యం నాయుడు పోలుపర్తి
నిర్మాతలు: కిరణ్ బాబు. సి
కథ, కథనం, మాటలు, సాహిత్యం, సంగీతం, దర్శకత్వం: కిరణ్ నైరుత్

కథ:

హైదరాబాద్ లోని ఓ బ్యాచిలర్ రూమ్ లో అర్జున్ అతని ఫ్రెంఢ్ తో కలిసి ఉంటాడు. తన ఫోన్ నుండి ప్రీతి అనే అమ్మాయికి ఆపకుండా కాల్ చేస్తూనే ఉంటాడు. తను లిఫ్ట్ చేయదు. ఇక ఓ యాసిడ్ బాటిల్ తీసుకొని తనని ఫాలో అవుతూ వెళ్తాడు. అదేసమయంలో దేవ కూడా వస్తాడు. అర్జున్ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసే ముందు తనని ఆపుతాడు దేవ. ఇక ఒక పార్కులో అర్జున్ ని కూర్చోబెట్టి. తనకొక కథ చెప్తుంటాడు దేవ. ఓ ఊరి నుండి వచ్చిన అబ్బాయి అంటు మొదలెట్టి అందులో అమ్మాయి చేసిన తప్పులని చెప్తుంటాడు. దాంతో అర్జున్ అదంతా వింటూ.. అమ్మాయిలంతా ఇంతే అంటు అరుస్తుంటాడు. అయితే అర్జున్ ని దేవ ఎందుకు ఆపాడు? ప్రీతి, అర్జున్ ల మధ్య సంబంధమేంటి? దేవ చెప్పిన కథలో అసలేం జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఓ ప్రేమికుడు నిజంగా ప్రేమిస్తే... పిచ్చిగా ప్రేమిస్తే ఇంతే ఉంటారనే పాయింట్ తో కథని ఎత్తుకున్న దర్శకుడు కిరణ్ నైరుత్ మెప్పించలేకపోయాడు.  సినిమా మొదట్లో విశ్వంలోని వివాహ వ్యవస్థ గురించి ఓ నాలుగు లైన్లు గొప్పగా రాయగానే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అనుకుంటారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుందన్నట్టుగా కథ అడల్ట్ వాళ్ళకే అన్నట్టుగా సాగుతుంది. 

అసలు కథ మొత్తం డైవర్ట్ చేస్తూ.. ప్రేమ, రొమాన్స్, లిప్ లాక్ లు , లవ్ ఫెయిల్యూర్ అంటూ తిరుగుతుంది. ప్రేమ గీమ తస్సాదియ్య అనే టైటిల్ కి బదులు లవ్ విత్ రొమాన్స్ అని పెడితే బాగుండేది. దర్శకుడు  ఏం చెప్పాలనుకున్నాడో అసలేం అర్థం కాదు. యూట్యూబ్ లోని‌ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కలిపి మిక్సీలో వేసి బయటకు తీసినట్టుగా ఉంటుంది. ఎక్కడ కూడా అసలు మనం సినిమామే చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. 

అసలు హీరో ఎవరో అర్థం కాదు. కథ, కథనం, సాహిత్యం, దర్శకత్వం,  సంగీతం అన్నీ కిరణ్ నైరుత్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. అసలు కథే బలహీనంగా ఉంటే ఎలా.. అసలు ఈ కథ ద్వారా తను ఏం చెప్పాలనుకున్నాడో తనకే తెలియదు. ఇక కొన్ని సీన్లు అయితే రోడ్డు మీద చేసే ప్రాంక్ లా అనిపిస్తుంటాయి. 

సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్, మ్యూజిక్ ఏది కుదరలేదు.. పోనీ కథ అయిన బాగుందంటే అసలేం ఉందో కూడా అర్థం కాదు. గంటా యాభై నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఈ మూవీ చూసాక చిన్న సినిమాలు చూడాలంటేనే భయమేస్తుంది. అంతలా ఉంది. అడల్ట్ సీన్ల కోసమే హీరోయిన్ లని తీసుకున్నట్లు అనిపిస్తుంది. అసలు సినిమా చూస్తున్నంతసేపు హీరోయిన్ ఎవరా అనే కన్ ఫ్యూజన్ వస్తుంది. సినిమా మొత్తంలో ఇది బాగుంది అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదు. గ్రిస్పింగ్ గా లేని కథనం, అవసరం లేని రొమాన్స్, అర్థం కానీ క్యారెక్టర్స్ అన్ని ఈ సినిమాకి పెద్ద మైనస్. ఫ్యామిలీతో కలిసి చూసేలా‌ కాకుండా ఒంటరిగా కూర్చొని చూసేలా ఉన్న ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.


నటీనటుల పనితీరు:

రిషిగా కిరణ్ నైరుత్,  పవిత్రగా సౌమ్య పాండే, దేవగా శుభలేఖ సుధాకర్, అర్జున్ గా విక్రమ్ వీర, ప్రీతిగా మమత చక్కగా నటించారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా : అడల్ట్ కంటెంట్ తో పాటు అర్థం కానీ కథనంతో సాగే ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.

రేటింగ్: 2 / 5

✍️. దాసరి  మల్లేశ్


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.