యువరాజ్ సింగ్ నాకు బ్రదర్ అంటున్న హీరోయిన్..!
on Apr 23, 2016
ప్రీతి జింతాకు రీసెంట్ గా పెళ్లయిపోయింది. చాలా సైలెంట్ గా, పెద్దగా హడావిడి లేకుండా ఆమె వివాహం జరిగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకుంది ప్రీతి. ముఖ్యంగా తన ఐపిఎల్ ఫ్రాంజైజీ కింగ్స్ లెవెన్ సభ్యులుగా ఉన్న యువరాజ్ తో, బ్రెట్ లీతో అఫైర్లు ఉన్నట్టు పుకార్లు వచ్చిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వాళ్లిద్దరూ తనకు బ్రదర్స్ లాంటి వాళ్లను, అలాంటి వాళ్లతో తనకు అఫైర్ ను ఫ్రేమ్ చేయడం చాలా బాధ కలిగించిందని ప్రీతీ చెప్పుకొచ్చింది. ఈ రక్షాబంధన్ పండగ సమయంలో వాళ్లిద్దరినీ కలిసి రాఖీ కట్టాలనుకుంటున్నాను. అంతే కాక యువరాజ్ పెళ్లికి రాఖీలు ఉన్న బాక్స్ ను గిఫ్ట్ గా ఇస్తానంటోంది. మా మధ్య బ్రదర్ సిస్టర్ మధ్య ఉండే అనుబంధం ఉంది. అందుకే అంత క్లోజ్ గా మూవ్ అవ్వగలిగే వాళ్లం. కానీ మీడియా ఆ బంధాన్ని తప్పుగా రాయడం నాకు చాలా ఆవేదన కలిగించింది అని ప్రీతీ క్లారిటీ ఇచ్చింది. పెళ్లెందుకు అంత రహస్యంగా చేసుకున్నారనే ప్రశ్నకు, నా జీవితం నాది మాత్రమే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. దాన్ని పబ్లిగ్గా చూపించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది అంటూ బదులిచ్చింది శ్రీమతి ప్రీతీజింతా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
