ప్రకాశ్.. తెలుగువారంటే అంత చులకనా..!
on Oct 18, 2016
తెలుగువాళ్లకి టెస్ట్ లేదు...తమిళ, మళయాళ, కన్నడ, బెంగాలీ చిత్ర పరిశ్రమలకు సినిమాలంటే ఫ్యాషన్...మంచి సినిమాను కాపాడుకోవాలని చూస్తారు అక్కడి ప్రేక్షకులు. కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తే ఆదరిస్తారు. కానీ తెలుగులో మాత్రం అలాంటి ప్రేక్షకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. నటనకు కొత్త భాష్యం చెప్పి, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్. ప్రజంట్ ఈ మోనార్క్‌కి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అవకాశాలు రాకపోయినా తానే డైరెక్టర్‌గా మారి సినిమాలు తీస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ మన ఊరి రామాయణం. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలైతే వచ్చాయి కాని డబ్బులు మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో తన సినిమా గొప్పతనం గురించి..మంచి సినిమాను ఆదరించాల్సిన బాధ్యత గురించి ట్విట్టర్లో ఓ వీడియో వదిలాడు ప్రకాశ్. అయినప్పటికి జనాలు మాత్రం ధియేటర్లకు రాలేదు. దీంతో సహనం కోల్పోయిన ప్రకాశ్ తెలుగు ప్రేక్షకులపై ఇలా తన అక్కసు వెళ్లగక్కాడు. అయితే ఆయన ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, ఆనంద్, ఆ నలుగురు, ఊపిరీ ఇలా తెలుగులో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు వాటిని చూశారు కాబట్టే అవి సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఎవరెన్ని చెప్పినా ప్రేక్షకుడు తనకు నచ్చితేనే చూస్తాడు..లేదంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు.