ప్రభాస్ పేరు కలవరిస్తున్న బన్నీ
on Apr 16, 2018
భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఎన్టీఆర్ రావడం, మహేష్ గురించి సినిమా గురించీ నాలుగు ముక్కలు మాట్లాడడం ఇండ్రస్ట్రీ వర్గాల్ని ఆకట్టుకుంది. హీరోల మధ్య ఇలాంటి అనుబంధమే కొనసాగితే బాగుంటుందని అంతా కోరుకున్నారు. మహేష్ కూడా ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందని, ఇక ముందు హీరోలంతా ఆడియో ఫంక్షన్లకు వస్తారని జోస్యం చెప్పాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈనెల 22న పాటల్ని విడుదల చేయనున్నారు. ఈకార్యక్రమానికి చిరంజీవి రావాల్సివుంది. కానీ సైరా షూటింగ్‌తో ఆయన బిజీగా ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో ప్రభాస్‌ని రప్పించాలని బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రభాస్ ఏమో.. సాహో షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాడు. కనీసం ఫంక్షన్ కోసమైనా దుబాయ్ నుంచి ప్రభాస్‌ని తీసుకుని రావాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమానికి ప్రభాస్ రావాలని, తనొస్తే ఈ సినిమాకి క్రేజ్ పెరుగుతుందని బన్నీ భావిస్తున్నాడు. మరి ప్రభాస్ వస్తాడో , రాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాలి.