ప్రభాస్ అలా.. చిరంజీవి ఇలా.. దారుణంగా ట్రోల్స్!
on Jan 13, 2026

'రాజా సాబ్'తో ప్రభాస్ పై ట్రోల్స్
'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవిపై ప్రశంసలు
అభిమానుల బాధను ప్రభాస్ పట్టించుకుంటాడా?
ఈ సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో ప్రభాస్ (Prabhas), 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి (Chiranjeevi) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక వైపు 'ది రాజా సాబ్' మూవీ ప్రభాస్ పై ట్రోల్స్ కి కారణమైతే, మరోవైపు 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
'ది రాజా సాబ్' సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే.. అసలు ఇందులో ప్రభాస్ నిజంగా నటించిన సీన్స్ ఎన్ని అనే చర్చ జరుగుతోంది. చాలా సీన్స్, ఫైట్స్, డ్యాన్స్ ల కోసం.. బాడీ డబుల్ ని ఉపయోగించడం, హెడ్ రీప్లేస్‌మెంట్ చేయడం వంటివి చేశారని సినిమా చూసిన మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో దర్శకుడు మారుతి సైతం.. బాడీ డబుల్ ని ఉపయోగించిన విషయాన్ని అంగీకరించాడు. స్టార్స్ నటించే చాలా సినిమాల్లో ఇలా కొన్ని సీన్స్ లో బాడీ డబుల్ ని ఉపయోగించడం అనేది సహజం. అయితే రాజా సాబ్ విషయంలో ఇది మితిమీరి పోయిందని, హెడ్ రీప్లేస్‌మెంట్ కూడా ఏమాత్రం బాలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. (The Raja Saab)
ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' పరిస్థితి అలా ఉంటే.. 'మన శంకర వరప్రసాద్ గారు' విషయంలో మాత్రం చిరంజీవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 70 ఏళ్ళ వయసులోనూ ప్రతి ఫ్రేమ్ లో తన ఎనర్జీతో మ్యాజిక్ చేశారు చిరు. డ్యాన్సుల్లో, ఫైట్స్ లో ఆయన పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ పై స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు సినిమా అంతా కనిపిస్తూ.. తనదైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, కామెడీ టైమింగ్ తో సినిమాని భుజాలపై మోశారు. దీంతో సోషల్ మీడియాలో అందరూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. (Mana Shankara Vara Prasad Garu)
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ గా ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి ప్రభాస్.. వేగంగా సినిమాలు చేయాలనో, లేక కాలికి సర్జరీ వల్లనో కానీ.. ఒక్కో సినిమాకి ఎక్కువగా డేట్స్ కేటాయించట్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో కాస్త ఆలస్యమైనా పర్లేదు.. ప్రభాస్ ఇలాంటి ట్రోల్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా చేయాలని.. అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



