2023 వేసవిలో `ప్రాజెక్ట్ కే`!
on Sep 21, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి వేసవి సీజన్ తో మంచి అనుబంధమే ఉంది. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన `బాహుబలి - ది కంక్లూజన్` (2017)తో పాటు `డార్లింగ్` (2010), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011) వంటి విజయవంతమైన చిత్రాలు కూడా సమ్మర్ సీజన్ లోనే రిలీజయ్యాయి. ఇక `ఎవడే సుబ్రమణ్యం` (2015), `మహానటి` (2018).. ఇలా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన రెండు సినిమాలు కూడా ఇదే సీజన్ లో జనం ముందు నిలిచాయి. వీటిలో `మహానటి` చిత్రం నాగ్ అశ్విన్ కి దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరు (ప్రభాస్, నాగ్ అశ్విన్) తొలిసారిగా కలిసి పనిచేస్తున్న `ప్రాజెక్ట్ కే` కూడా ఇదే వేసవి సీజన్ ని టార్గెట్ చేసుకుందని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ బాట పట్టింది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్.. నవంబర్ నుంచి 13 నెలల పాటు ఏకధాటిగా షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు.. సినిమాని 2023 సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానున్నది. మరి.. వేర్వేరుగా వేసవిలో విజయాలు అందుకున్న ప్రభాస్, నాగ్ అశ్విన్.. కాంబినేషన్ పరంగానూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
కాగా, `ప్రాజెక్ట్ కే`లో ప్రభాస్ కి జంటగా దీపికా పదుకోణ్ నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నాడు.
Also Read